అక్రమంగా తరలిస్తున్న 354 కిలోల హెరాయిన్‌ను దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం దీని విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు.
"నలుగురు నిందితులు రిజ్వాన్ కశ్మీరీ, గురుప్రీత్ సింగ్, గుర్జోత్ సింగ్, హజ్రత్ అలీగా గుర్తించాం. హజ్రత్ అలీ అఫ్గాన్ దేశస్థుడు. గతంలో ఓ డ్రగ్ కేసులోనూ కశ్మీరీ నిందితుడిగా ఉన్నాడు. హెరాయిన్‌ను అక్రమంగా తరలించనున్నట్లు ముందస్తు సమాచారం అందింది. అందుకే.. పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్ చేశాం."
-- స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా
హెరాయిన్‌ను అఫ్గాన్ నుంచి ఇరాన్.. అక్కడి నుంచి భారత్‌లోని ముంబయి పోర్ట్‌కు సముద్ర మార్గం ద్వారా తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇదీ చదవండి: శబ్దాలు చేస్తే రూ.లక్ష జరిమానా!