ETV Bharat / bharat

కుర్రాడికి ఆస్పత్రి ఫోన్.. మీరు చనిపోయారంటూ... - మహారాష్ట్ర సతారా జిల్లా కరోనా మరణ వార్తలు

మీరు బతికున్నప్పటికీ చనిపోయారని మీకే ఫోన్​ వస్తే? కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. ప్రభుత్వాసుపత్రి నుంచి మీ మరణ వార్త మీ కుటుంబ సభ్యులకు అందితే? ఆశ్చర్యంతో పాటు.. కోపం కూడా వస్తాయి కదా! మహారాష్ట్రకు చెందిన ఓ యువకునికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

hello-you-are-dead
ఆస్పత్రి నిర్వాకం: బతికున్నా.. చనిపోయారంటూ ఫోన్
author img

By

Published : Jun 9, 2021, 1:53 PM IST

'హలో.. మేము ప్రభుత్వాస్పత్రి నుంచి మాట్లాడుతున్నాం. మీరు కరోనాతో మరణించారు' అని ఫోన్​ ఎత్తిన వ్యక్తికి మరణవార్తను తెలియజేశాడు అవతలి వ్యక్తి. వినేందుకు అత్యంత ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

hello-you-are-dead
ఫోన్​కాల్​పై విచారం వ్యక్తం చేస్తున్న సిద్ధాంత్ మిలింద్ భోస్లే

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన 20 ఏళ్ల ఏళ్ల సిద్ధాంత్ మిలింద్ భోస్లే గత నెల కరోనా బారిన పడ్డాడు. అతనొక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు కూడా. అయితే.. ఈ సోమవారం అతనికి ప్రభుత్వాస్పత్రి నుంచి తాను కరోనాతో మరణించినట్లు ఫోన్​ వచ్చింది. ఈ విషయం విన్న మిలింద్ షాక్‌కు గురై తన తల్లి సప్నాకు ఫోన్​ ఇచ్చాడు. సదరు ఆసుపత్రి సిబ్బంది ఆమెకూ అదే విషయాన్ని తెలపగా.. కంగారు పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఈ అంశంపై ఆరా తీశారు. కానీ.. తమకు వచ్చిన జాబితా ప్రకారమే ప్రజలకు సమాచారం అందిస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారని సప్నా వివరించారు.

hello-you-are-dead
తన తల్లి సప్నాతో సిద్ధాంత్ మిలింద్ భోస్లే

"నేను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. ఈ ఫోన్​కాల్ రావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. మా కుటుంబం అంతా షాక్​లో ఉంది."

-సిద్ధాంత్ మిలింద్ భోస్లే

ఇవీ చదవండి: పెళ్లికి ముందు సహజీవనంపై హైకోర్టు కీలక తీర్పు

'టీకాల పనితీరుకు యాంటీబాడీలే ప్రామాణికం కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.