జమ్ముకశ్మీర్లో సైనిక హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జిల్లాలోని శివగఢ్ ధర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 10.30-10.45 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత అందులో ప్రయాణిస్తున్న పైలట్లను స్థానికులు కాపాడారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. అయితే, దురదృష్టవశాత్తూ అక్కడ చికిత్స పొందుతూ.. పైలట్లు ఇద్దరూ చనిపోయారు.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్.. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్కు చెందినదని అధికారులు స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరగడం వల్ల అక్కడకు చేరుకోవడానికి సమయం పట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Viral Video: మెడకు బెల్ట్ కట్టి.. యువకుడిపై కర్రలతో దాడి