Army chopper crash: తమిళనాడులో హెలికాప్టర్ కూలి త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ప్రమాద సమాచారాన్ని ప్రధానికి రాజ్‌నాథ్ వివరించారు.
హెలికాప్టర్ క్రాష్ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఘటనా స్థలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రావత్ ఇంటికి రాజ్‌నాథ్..
రక్షణ శాఖ కార్యాలయంలో సమావేశం అనంతరం.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు రాజ్‌నాథ్ సింగ్.
పార్లమెంట్‌లో ప్రకటన..
హెలికాప్టర్ ప్రమాద ఘటనపై పార్లమెంట్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రకటన చేసే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కూనూర్‌లో ప్రమాదం..
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సతీమణి, కొందరు కుటుంబసభ్యులు సహా మొత్తం 14 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: Army chopper crash: ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ లైవ్ వీడియో!
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్- సీడీఎస్ రావత్ పరిస్థితిపై ఆందోళన