ETV Bharat / bharat

'మహిళ ఆస్తిపై తండ్రి వారసులకూ హక్కు'

author img

By

Published : Feb 25, 2021, 4:03 PM IST

మహిళ ఆస్తిపై ఆమె తండ్రి వారసులకూ హక్కు ఉంటుందని అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఈ ఆస్తి మార్పిడి సరైనదే అని తీర్పు వెలువరించింది.

Heirs of father of woman can inherit property
'మహిళ తండ్రి వారసులూ ఆ ఆస్తి పొందేందుకు అర్హులే'

హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఓ మహిళ ఆస్తిని... ఆమె తండ్రి వారసులూ పొందవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 15(1)(డీ) ప్రకారం ఆస్తిని పొందేందుకు మహిళ తండ్రి వారసులు అర్హులే అని జస్టిస్​ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వారిని పరాయివారిగా పరిగణించలేమని తెలిపింది.

జగ్నో అనే ఓ మహిళ వేసిన కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ విధంగా తీర్పు వెలువరించింది.

ఇదీ జరిగింది....

జగ్నో భర్త షేర్ సింగ్ 1953లో మరణించారు. భర్త మరణం తర్వాత ఆమె తన పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన తమ్ముడి కుమారులకు ఇచ్చారు. అయితే జగ్నో... తన సొంత వాళ్లకు ఈ ఆస్తిని పంచుకోవడాన్ని షేర్​ సింగ్ అన్నదమ్ముల వారసులు సవాల్​ చేశారు.

ఈ కేసుపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం... భర్త మరణం అనంతరం ఆస్తి జగ్నో పేరిట ఉంది కనుక తన తండ్రి వారసులకు ఈ ఆస్తిని ఇవ్వడం తప్పు కాదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:పిల్లల బొమ్మలతో 'రఫేల్'​ జెట్స్​కు ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.