జమ్ముకశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తోంది. అనేక ప్రాంతాలను మంచు కప్పేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తుండటం వల్ల ఇళ్లపై కొన్ని అంగుళాల మేర మంచు పేరుకు పోయింది. రహదారులన్నీ పూర్తిగా మంచుతో నిండిపోయాయి.
నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు కూడా ఇళ్ల నుంచి బయటకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలు మంచులో కూరుకుపోయాయి.