ETV Bharat / bharat

Heavy rains: విరిగిపడిన కొండచరియలు- ఇద్దరు మృతి - heavy rain

ఉత్తర భారతదేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. జమ్ముకశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, దిల్లీ, బిహార్​ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్​ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మరణించారు.

Heavy rain
భారీ వర్షాలు
author img

By

Published : Jul 13, 2021, 10:00 AM IST

Updated : Jul 13, 2021, 12:06 PM IST

భారీ వర్షాలు

జమ్ముకశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, దిల్లీ, బిహార్​ సహా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్​ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మరణించారు. మంగళవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

విరిగిపడిన కొండచరియలు

heavy rain
మట్టిలో కూరుకుపోయిన కారు
heavy rain
వరదకు కొట్టికుపోయిన కారు

వర్షాల ధాటికి హిమాచల్​ప్రదేశ్​ కంగ్రా జిల్లాలో బోహ్​ లోయలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మంది గల్లంతయ్యారు. కాగా పలు ప్రాంతాల్లో 20 మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోహ్​ లోయలో 100మందికి పైగా బాధితులను కాపాడారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కశ్మీర్​లో భారీ ట్రాఫిక్​

జమ్ముకశ్మీర్​లో కొండచరియలు విరిగిపడటం వల్ల జమ్ము- శ్రీనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. దీంతో వన్​వే తెరిచిన అధికారులు.. అత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్న వాహనాలకే అనుమతిస్తున్నారు.

heavy rain
భారీగా ప్రవహిస్తున్న వరద నీరు

చెరువులను తలపిస్తున్న వీధులు

heavy rain
చెరువులను తలపిస్తున్న వీధులు
heavy rain
నీట మునిగిన వాహనాలు

బిహార్​లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముజఫర్‌పుర్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడం వల్ల స్థానికులు పడవల్లో ప్రయాణిస్తున్నారు.

ఉత్తరాఖండ్​

Heavy rain
రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు

రాష్ట్రంలో భారీ వర్షాల ధాటికి ఉత్తర్​కాశీ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా గంగోత్రి రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. శిథిలాలు తొలగిస్తున్నారు.

ఇదీ చూడండి: సైనిక సంస్కరణలపై దుమారం- శ్రేణుల మధ్య మాటల రచ్చ

Last Updated : Jul 13, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.