ETV Bharat / bharat

ముంచుకొస్తున్న బురేవి- విస్తారంగా వర్షాలు - burevi cyclone news

బురేవి తుపాను ధాటికి రాత్రి నుంచి తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దక్షిణ తమిళనాడులోని పంబన్​, కన్యాకుమారి మధ్య తుపాను తీరం దాటనున్నట్లు స్పష్టం చేసింది.

Heavy rains lash TN, Puducherry as cyclonic storm Burevi nears
ముంచుకొస్తున్న బురేవి- విస్తారంగా వర్షాలు
author img

By

Published : Dec 3, 2020, 3:43 PM IST

తమిళనాడులోని పంబన్​, కన్యాకుమారి ప్రాంతాల మధ్యలో బురేవి తుపాను ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నట్లు ఐఎండీ పేర్కొంది.

Heavy rains lash TN, Puducherry as cyclonic storm Burevi nears
కరైకల్​లో భారీ వర్షం

పెనుగాలల ధాటికి నేలకొరిగిన వృక్షం

విస్తారంగా కురుస్తున్న వర్షాలు

"పంబన్​కు చాలా సమీపంలో తుపాను కేంద్రీకృతమైంది. ఉత్తర శ్రీలంక నుంచి 70 నుంచి 80 కి.మీ వేగంతో దూసుకుస్తోంది. పంబన్, కన్యాకుమారి సమీప ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురిసి వర్షాలతో ఉదయం వరకు 20 సెం.మీ వర్షపాతం నమోదైంది."

-భారత వాతావరణ శాఖ

సహాయానికి సిద్ధం...

బురేవి తుపాను ప్రభావం అధికంగా ఉండే తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎటువంటి సాయాన్ని అయినా అందించేందుకు మోదీ సర్కార్​ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 'బురేవి'ని ఎదుర్కొనేందుకు కేరళ, తమిళనాడు సన్నద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.