దిల్లీలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రగతి మైదాన్, మథురా రోడ్, మోతి బాగ్, వికాస్ మార్గ్, సంగమ్ విహార్, కిరారి ప్రాంతాలు వరద ప్రవాహంలో మునిగిపోయాయి.
![Heavy rains in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12584891_vlcsnap-2021-07-27-10h17m00s486-2.jpg)
![Heavy rains in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12584891_vlcsnap-2021-07-27-10h17m00s486-3.jpg)
రహదారులపైకి వరద నీరు భారీగా చేరుకోవడం వల్ల అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మోతి బాగ్ మెట్రో స్టేషన్, దౌలా కువాన్ అండర్ పాస్, మథురా రోడ్ సహా పలు ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ప్రయాణం సాగించాయి.
![Heavy rains in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12584891_vlcsnap-2021-07-27-10h17m00s486-1.jpg)
![Heavy rains in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12584891_vlcsnap-2021-07-27-10h15m49s057-3.jpg)
కంప్లైంట్స్
వర్షాల వల్ల స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ప్రజా పనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యక్రమంలో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉన్నారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
![Heavy rains in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12584891_vlcsnap-2021-07-27-10h15m49s057-2.jpg)
![Heavy rains in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12584891_vlcsnap-2021-07-27-10h15m49s057-1.jpg)
నైరుతి రుతుపవనాలు జులై 13న దిల్లీకి చేరుకున్నాయి. అప్పటి నుంచి రాజధానిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: ఇసుక తుపాను ధాటికి 8 మంది మృతి