Maharashtra rains: రుతుపవనాల ప్రభావంతో ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయంవరకూ కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధానిలో ట్రాఫిక్ నెమ్మదించింది. సియోన్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. నడుములోతు నీటిలో వాహనాలు నడపడం సాధ్యపడడం లేదు.
నవీ ముంబయిలోని ఖందేశ్వర్ రైల్వేస్టేషన్ జలమయమైంది. మోకాళ్లులోతు వరకు నీళ్లు చేరాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. అంధేరి ప్రాంతంలోనూ భారీ వర్షానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సబర్బన్ రైళ్లన్నీ సాధారణంగానే తిరుగుతున్నా.. రోడ్లపై వరద నీరు చేరడం వల్ల... పలు బస్సులను దారిమళ్లించారు.
వచ్చే కొన్ని రోజులు ముంబయి పరిసరప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర సర్కార్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. ముంబయి, పరిసర జిల్లాల అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే ఆదేశించారు.
ఇదీ చదవండి: