సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళనలు చేస్తోన్న రైతులకు.. వర్షం రూపంలో మరో కష్టం వచ్చి పడింది. దేశ రాజధాని ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తోన్న వానలకు నిరసన వేదికలన్నీ జలమయమయ్యాయి.
వాన నీరు నిలవడం వల్ల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. వర్షం తర్వాత చలి విపరీతంగా పెరిగింది. వాటర్ ప్రూఫ్ గుడారాలలో ఉంటున్నప్పటికీ అవి రక్షణగా లేవు. ఇన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వం మా వంక చూడట్లేదు.
- అభిమన్యు కోహర్, సంయుక్త్ కిసాన్ మోర్చా సభ్యుడు
దేశ రాజధానిలో అనేక ఇబ్బందులు పడుతున్నామని గుర్వీందర్ సింగ్ అనే మరో రైతు పేర్కొన్నాడు. అయినా.. మా డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడి నుంచి కదలమని స్పష్టం చేశాడు. చాలా ప్రాంతాల్లో వాన నీరు నిలిచిందని వాపోయాడు.
మరోవైపు, దిల్లీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతవరణ శాఖ నివేదించింది. శీతల గాలుల ప్రభావంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. జనవరి 6 వరకు వడగళ్లతో కూడిన వర్షాలున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'టీకా'పై భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన డబ్ల్యూహెచ్ఓ