దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తాయి. కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నాసిక్‌లోని పలు ఆలయాలు, ఇళ్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు (gujarat rain news today) కురుస్తున్నాయి. అలియాబాడా గ్రామంలో వరదల కారణంగా నడుములోతు వరకు నీరు చేరింది. రోడ్లపై వాననీరు నిలవటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. రాజ్‌కోట్‌లో వరదలో కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (maharashtra rain update) గోదావరి నదిలో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. నదీతీర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నాసిక్‌లోని పలు ఆలయాలు నీటమునిగాయి. ముంబయి, ఠాణె, పాల్ఘర్ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు (maharashtra rain forecast) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఒడిశాలోనూ భారీ వర్షాలు (odisha rain news) ముంచెత్తుతున్నాయి. 63 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భువనేశ్వర్‌లో 195 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. కేంద్రపడలో గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో భారీవర్షాలు కురుస్తాయని ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దిల్లీలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు (delhi rain news) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధాన మార్గాల్లోని అండర్‌పాస్‌ల్లోకి వరద ముంచెత్తటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారుల వాననీరు నిల్వటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి : వరద ముంపులో పట్టణాలు.. అతివృష్టితో బీభత్సం