ETV Bharat / bharat

బిహార్​ను ముంచెత్తిన వరదలు- ప్రజల అవస్థలు - బిహార్ వర్షాలు

భారీ వర్షాలతో బిహార్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నీటి చిక్కుకున్నాయి. రాత్రికిరాత్రి వరద పోటెత్తగా ఎటువెళ్లాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికార యంత్రాంగం తమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోతున్నారు.

bihar flood
బిహార్ వరద
author img

By

Published : Jul 6, 2021, 3:41 PM IST

బిహార్​లో వరద దృశ్యాలు

బిహార్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. తూర్పు చంపారన్, ముజఫర్‌పూర్‌ జిల్లాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రికిరాత్రి ఇళ్లలోకి పెద్దఎత్తున వరద నీరు చేరగా, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండగా, పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. కొంత మంది మహిళలు చంటిబిడ్డలను తీసుకొని వరదనీటిలో ప్రమాదకరంగానే ప్రయాణిస్తున్నారు.

తూర్పు చంపారన్‌ జిల్లా బగహ ప్రాంతంలో రహదారులపై మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండగా ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బగహ ప్రజలు వరదలతో అల్లాడుతున్నప్పటికీ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎలాంటి సహాయ, పునరావాస చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు తగ్గేలా తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: డిప్యూటీ సీఎం కొడుకు కారు ఢీకొని రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.