ETV Bharat / bharat

Supreme Court on Chandrababu Petition: చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ - chandrababu quash petition in SC

Supreme Court on Chandrababu Petition
Supreme Court on Chandrababu Petition
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 11:11 AM IST

Updated : Sep 26, 2023, 11:35 AM IST

11:10 September 26

ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడి

Supreme Court on Chandrababu Petition: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17A కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development Case) తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన ఎస్​ఎల్​పీ (Special Leave Petition)పై సుప్రీంకోర్టు స్పష్టతని ఇచ్చింది. తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ.. చంద్రబాబు SLP వేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై.చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసును మెన్షన్‌ చేశారు.

అత్యవసరం ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చామని, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసని, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ (Chief Justice of India) స్పందిస్తూ మంగళవారం రావాలని సూచించారు. దీనిపై మెమో దాఖలు చేశారు. చంద్రబాబు ఎప్పటినుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించారు. 8న ఆయన్ను అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సెప్టెంబర్‌ 8 నుంచా అని ప్రశ్నిస్తూ.. మంగళవారం మెన్షనింగ్‌లో రండి, ఏం చేయాలన్నది చూస్తాం అంటూ CJI విచారణను ముగించారు. దీంతో రేపు విచారణ చేపట్టేందుకు సీజేఐ అంగీకరించారు. ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడించనున్నారు. క్వాష్‌ పిటిషన్‌ను (Chandrababu Quash Petition) హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు చంద్రబాబు వెళ్లారు.

Last Updated : Sep 26, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.