ETV Bharat / bharat

'ఎర్రకోట ఘటనకు నేను బాధ్యుడిని కాదు' - దీప్​ సిద్ధూ కోర్టులో

జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు తాను కారకుడిని కానని దిల్లీ కోర్టుకు తెలిపారు పంజాబీ నటుడు దీప్​ సిద్ధూ. ఆందోళనకు రైతు సంఘాలే పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. ట్రాక్టర్​ ర్యాలీని ఎర్రకోట వైపు తాను మళ్లించలేదని పేర్కొన్నారు.

deep Sidhu at a Delhi court
'ఎర్రకోట' ఘటనకు నేను బాధ్యుడ్ని కాదు: దీప్​ సిద్ధూ
author img

By

Published : Apr 8, 2021, 12:50 PM IST

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు తాను బాధ్యుడిని కానని పంజాబీ నటుడు దీప్​ సిద్ధూ పేర్కొన్నారు. ట్రాక్టర్​ ర్యాలీని ఎర్రకోట వైపు తాను మళ్లించలేదని చెప్పారు. ఆందోళనకు రైతు నేతలే పిలుపునిచ్చారని, తాను ఏ రైతు సంఘంలోనూ సభ్యుడిని కానని దిల్లీ కోర్టుకు తెలిపారు దీప్​ సిద్ధూ.

ఈ మేరకు బెయిల్​ పిటిషన్​పై విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు ఆయన తరఫు న్యాయవాది.

" నేను ఏ ఒక్క హింసాత్మక చర్యల్లో కూడా పాల్గొనలేదు. హింస చెలరేగడానికి ముందే నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. వీడియో మాత్రమే నేను పోస్టు చేశాను. అది నా పొరపాటే. ప్రతి పొరపాటు నేరం కాదు. నేను వీడియో పోస్టు చేసినందుకు.. మీడియా నన్ను నిందితునిగా చూపెట్టింది. అన్ని మీడియాల్లో నన్నే ప్రధాన కుట్రదారుగా చూపించారు. ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు."

- దీప్​ సిద్ధూ, పంజాబీ నటుడు.

వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ఏప్రిల్​ 12కు వాయిదా వేసింది. దీప్​ సిద్దూ ప్రసంగానికి సంబంధించి ట్రాన్స్​స్క్రిప్ట్​ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా ఎర్రకోట వద్ద నిరసనకారులు బీభత్సం సృష్టించారు. ఈ కేసులో దీప్​ సిద్ధూను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:'ఎర్రకోట ఘటన' కేసులో దీప్​ సిద్ధూ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.