ETV Bharat / bharat

ఆరోగ్య శాఖ అధికారులతో ఈసీ కీలక భేటీ- అసెంబ్లీ ఎన్నికలపై..

Health Secretary EC meet: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా కేసుల పరిస్థితి, ఒమిక్రాన్‌ రకం తీవ్రతపై తాజా వివరాలను ఈసీ ఈ సమావేశం ద్వారా తెలుసుకోనుంది.

covid
కొవిడ్
author img

By

Published : Dec 27, 2021, 5:18 AM IST

Health Secretary EC meet: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌తో ఎన్నికల అధికారులు ఇవాళ(డిసెంబర్ 27) భేటీ కానున్నారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితి, ఒమిక్రాన్‌ వ్యాప్తిపై ఎన్నికల కమిషన్‌కు రాజేశ్‌ భూషణ్‌ సూచనలు చేయనున్నట్లు సమాచారం.

గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో పూర్తికానుండగా.. మేలో ఉత్తర్​ప్రదేశ్‌లో అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. మరోవైపు.. ఎన్నికల తేదీలను వచ్చే నెలలో ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

కొవిడ్‌ మూడో ఉద్ధృతి భయాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఒకట్రెండు నెలలు వాయిదావేయాలని, అన్ని ఎన్నికల ర్యాలీలను నిషేధించాలని.. యూపీ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అలహాబాద్‌ హైకోర్టు గురువారం కోరింది. దీంతో ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని సీఈసీ సుశీల్‌ చంద్ర తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈసీ ఇప్పటికే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో పర్యటించింది.

ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి..

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై ప్రధాని మోదీ, అధికారంలో ఉన్న భాజపా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టే వారి తదుపరి కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ సాయి దర్శనం టైమింగ్స్​లో కీలక మార్పులు

మహిళా ఓటర్లకు ప్రియాంక వరాలు- 40% ఉద్యోగాలు వారికే

యూపీలో పార్టీల ఎత్తులు జిత్తులు- గెలుపు వ్యూహాల్లో తలమునకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.