బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తోన్న కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్పై చర్చించడానికి అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఉమ్మడి పర్యవేక్షణ బృందాల(జేఎండీ)తో స్ట్రెయిన్ ఆవిర్భావం సహా పలు కీలక విషయాలుపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి జేఎండీ సభ్యుడైన ప్రపంచ ఆరోగ్య సంస్థలోని భారత ప్రతినిధి డాక్టర్ రోడరికో హెచ్ ఓఫ్రిన్ హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోందంటూ.. లండన్‌లో అక్కడి ప్రభుత్వం, ఆదివారం లాక్‌డౌన్ అమలు విధించింది. దీంతో ఇప్పటికే బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు బ్రిటన్ విమానాలపై నిషేధాజ్ఞలు విధించాయి. జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తోంది. ఈ రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
ఇదీ చూడండి: 'జనవరిలోనే కరోనా వ్యాక్సిన్'