దేశంలో 28 రోజులుగా 430 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. టీకా తీసుకున్నాక కూడా కరోనా సోకడంపై స్పందించారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అలా కరోనా సోకుతుందని అన్నారు.
దిల్లీలోని గుండె, ఊపిరితిత్తుల ఇన్స్టిట్యూట్లో కొవాగ్జిన్ కరోనా టీకా రెండో డోసును ఆయన భార్య నూతన్ గోయల్‌తో కలిసి తీసుకున్నారు హర్షవర్ధన్. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని తెలిపారు.
60 ఏళ్లు, అంతకంటే వయస్సు పైబడిన వారు, 45 ఏళ్ల వయస్సుండి ఇతర వ్యాధులతో బాధపడేవారి కోసం కేంద్రం కరోనా టీకాను ఇటీవల పంపిణీ చేస్తోంది. వారంతా టీకా తీసుకోవాలని హర్షవర్ధన్ కోరారు. భారత టీకా సామార్థ్యాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారి మాటలు నమ్మవద్దని అన్నారు.
టీకా తొలి డోసును హర్షవర్ధన్ మార్చి 2న తీసుకున్నారు.
ఇదీ చదవండి: సొంత ప్రజల కన్నా వారికే ఎక్కువ టీకాలు: భారత్