Harish Rao Launched Arogya Mahila Scheme: మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు పథకాలు ప్రవేశపెట్టాలని భావించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అందులో ఒకటి ఆరోగ్య మహిళ పథకం .. మరొకటి శ్రీరామనవమికి కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ అందిచనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే కరీంనగర్‌లోని బుట్టి రాజారాం కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో.. ఆరోగ్య మహిళ పథకాన్నిమంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ కలిసి ప్రారంభించారు.
గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి అనే పథకంను తీసుకొచ్చామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. చాలా మంది మహిళలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆ విషయాన్ని ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకం తీసుకువచ్చిందని చెప్పారు. ఈ పథకంలో.. ఎనిమిది రకాల సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 100 కేంద్రాలు ప్రారంభించబోతున్నామని అన్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లో ప్రారంభిస్తున్నామని హరీశ్‌రావు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు: ఈ కేంద్రంలో అందరు మహిళలే సేవలు అందిస్తారని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభిస్తామని.. క్రమంగా మరిన్ని పెంచుతామని వివరించారు. ఇక్కడ అందరు మహిళలే ఉంటారని.. దీనిని ఆడవాళ్లందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. సుమారు 40 నుంచి 50 శాతం మంది మహిళలు.. వివిధ రకాల ఇబ్బందులు పడుతున్నట్లు తమ సర్వేలో తేలిందని హరీశ్‌రావు చెప్పారు.
సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యం చేయించుకుంటే సమస్య తీరిపోతుందని.. లేకపోతే సమస్య పెద్దగా మారే అవకాశం ఉందని హరీశ్‌రావు వెల్లడించారు. గర్భిణీలకు న్యూట్రీషియన్ కిట్లు.. రెండు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ప్రసూతి తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తే .. శిశువు గర్భంలో ఉన్నప్పుడు న్యూట్రీషియన్ కొరతను అధిగమించేందుకు ఈ కిట్లు ఇవ్వనున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు.
"ఈ రోజు కొత్తగా 2 పథకాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అందులో ఒకటి ఆరోగ్య మహిళ పథకం. శ్రీరామ నవమికి కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ ఇస్తాం. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చాం. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభిస్తాం. క్రమంగా ఆరోగ్య మహిళా కేంద్రాలు పెంచుతాం. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలే సేవలు అందిస్తారు. గర్భిణీలకు 2 న్యూట్రీషియన్ కిట్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు న్యూట్రీషియన్ కిట్ ఇస్తాం." -హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: ఇప్పటివరకు అతివల కోసం కేసీఆర్ సర్కారు ఎంత ఖర్చు చేసిందంటే?
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం.. మంత్రివర్గంలోకి 8 మంది..