Border Gavaskar Trophy 2024 Live : 2024 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా మూడుసార్లు సిరీస్ దక్కించుకున్న టీమ్ఇండియా నాలుగోసారి కూడా విజయఢంకా మోగించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు స్వదేశంలో ఈసారైనా సత్తా చాటాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు పెర్త్ స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ సిరీస్‌ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు. మీకు తెలుసా?
ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్‌కు ప్రముఖ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు చెందిన అన్ని ఛానెళ్లతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ HD ఛానెళ్లతో పాటు స్టార్ స్పోర్ట్స్ 4 తెలుగు, కన్నడ వంటి స్థానిక భాషల్లోనూ టెలికాస్ట్ కానుంది. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ ఛానెళ్లలో ఫ్రీగా చూడడానికి అవకాశం లేదు. దీంతోపాటు హాట్‌స్టార్‌లోనూ సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే.
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
అయితే భారత్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్- ఆసీస్ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లనూ ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్‌లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు చెప్పింది. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండానే డీడీ స్పోర్ట్స్‌లో లైవ్ మ్యాచ్ ఎంజాయ్ చేసేయోచ్చు.
మ్యాచ్‌ల టైమింగ్స్ ఏంటి
ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఈ సిరీస్ మ్యాచ్‌లన్నీ అక్కడి టైమింగ్స్ ప్రకారం షెడ్యూల్ అయ్యాయి. ఒక్కో మ్యాచ్ ఒక్కో సమయానికి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ట్రోఫీలో ఏయే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కానుందో చూద్దాం.
Race for the #WTC25 Final is about to heat up with the #AUSvIND Test series 🔥🏆
— ICC (@ICC) November 21, 2024
Two spots. Five teams in contention 🏏 pic.twitter.com/xCeh8dLWCa
తొలి టెస్టు | నవంబర్ 22- 26 | పెర్త్ | ఉదయం 7.30 |
రెండో టెస్టు (డే/నైట్) | డిసెంబర్ 06- 10 | అడిలైడ్ | ఉదయం 9.30 |
మూడో టెస్టు | డిసెంబర్ 14- 18 | బ్రిస్బేన్ | ఉదయం 5.50 |
నాలుగో టెస్టు | డిసెంబర్ 26- 31 | మెల్‌బోర్న్ | ఉదయం 5.00 |
ఐదో టెస్టు | జనవరి 03- 08 | సిడ్నీ | ఉదయం 5.00 |
ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్ రెడీ- నేరుగా పెర్త్ స్టేడియానికి కెప్టెన్!
'విరాట్‌కు ఆ రెండే కీలకం- ఒక్కసారి అలా చేస్తే ఆసీస్‌కు చుక్కలే'