ETV Bharat / bharat

పాఠశాలలో విద్యార్థినికి ముద్దుపెట్టిన హెడ్​మాస్టర్​పై సస్పెన్షన్ వేటు - లైంగిక దాడి

Headmaster kiss student: తన ఛాంబర్​లో ఓ విద్యార్థినికి ముద్దు పెడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన హెడ్​మాస్టర్​ను సస్పెండ్​ చేశారు ఉన్నతాధికారులు. ఈ సంఘటన కర్ణాటక, మైసూర్​ జిల్లాలోని హెచ్​డీ కోటే తాలూకాలో జరిగింది. విద్యా శాఖ ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

Headmaster suspended
పాఠశాలలో విద్యార్థినికి ముద్దుపెట్టిన హెడ్​మాస్టర్​పై సస్పెన్షన్ వేటు
author img

By

Published : Jan 29, 2022, 8:32 PM IST

Headmaster kiss student: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ముద్దు పెట్టుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన హెడ్​మాస్టర్​పై సస్పెన్షన్​ వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ సంఘటన కర్ణాటక, మైసూర్​ జిల్లాలోని హెచ్​.డి.కోటే తాలుకాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది.

ఇదీ జరిగింది..

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్​.ఎం.అనిల్​కుమార్​.. విద్యార్థినిని తన ఛాంబర్​లోకి తీసుకెళ్లి ముద్దు పెడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తుండగా.. మిగిలిన విద్యార్థులు కిటికీలోంచి వీడియో తీశారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

వీడియో ఉన్నతాధికారులకు చేరిన క్రమంలో హెడ్​మాస్టర్​పై చర్యలకు ఉపక్రమించారు. పాఠశాల మేనేజ్​మెంట్​ కమిటీ అత్యవసరంగా భేటీ అయి.. సస్పెన్షన్​ వేటు వేశారు.

గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు బ్లాక్ ఎడ్యుకేషన్​ అధికారి చంద్రకాంత్. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుడి ప్రవర్తన మొత్తం విద్యాశాఖకే మచ్చగా పేర్కొన్నారు.

విద్యా శాఖ ఫిర్యాదు మేరకు పాఠశాల హెడ్​మాస్టర్​ ఆర్​.ఎం.అనిల్​కుమార్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపడుతున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Girl Suicide: వివాహితుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.