బంగాల్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఇన్ఛార్జ్ సుదీప్ జైన్ పక్షపాతి అని తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఖండించింది. జైన్‌పై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులు అందరూ రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరిస్తారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పలు సందర్భాల్లో పొరపాట్లు తలెత్తుతాయని, అయితే వాటిపై వెంటనే చర్యలు చేపడతున్నామని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల అధికారులపై ఇలా నింద మోపడం తొలిసారి కాదని తెలిపింది. ఏ నిర్ణయమైనా డిప్యూటీ ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్, నోడల్ పోలీస్ అధికారి సహా సీనియర్ అధికారులతో చర్చించి తీసుకుంటామని ఉద్ఘాటించింది. ఇది వరకు తృణమూల్ కాంగ్రెస్.. జైన్‌పై చేసిన ఆరోపణలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జైన్ తీసుకున్న పలు నిర్ణయాలను తృణమూల్ తప్పుపట్టింది.
సుదీప్ జైన్‌ను బాధ్యతల నుంచి తొలగించాలంటూ తృణమూల్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఎన్నికల కమిషన్‌కు గురువారం లేఖ రాశారు. జైన్ పక్షపాతంగా వ్యవహరిస్తారని.. అందుకు 2019 ఎన్నికలే ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఆటో డ్రైవర్‌కు రూ.56 వేల కరెంటు బిల్లు