ETV Bharat / bharat

డ్రీమ్ 11లో జాక్​పాట్.. రూ.కోటి గెలుచుకున్న యువకుడు - డ్రీమ్ 11లో కోటి రూపాయలు

Dream 11 crore win: డ్రీమ్ 11... చాలా మందికి తెలిసిన పేరే. ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. తమ అంచనాల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తొలిస్థానంలో నిలిచి జాక్​పాట్ కొట్టాలని భావిస్తుంటారు. కానీ, అతికొద్ది మందికే అలాంటి అవకాశం లభిస్తుంటుంది. అలాంటి వాళ్లలో ఈయన ఒకరు. డ్రీమ్​ 11లో రాత్రిరాత్రే రూ.కోటి కొల్లగొట్టాడు.

dream 11 crore
dream 11 crore
author img

By

Published : Jun 29, 2022, 8:31 PM IST

UP man wins Dream 11: ఫాంటసీ క్రికెట్ గేమ్​లో జాక్​పాట్ కొట్టాడు ఉత్తర్​ప్రదేశ్ వాసి. డ్రీమ్​ 11 యాప్​లో ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు. పీలీభీత్​లోని హరిపుర్ కిషన్​పుర్ గ్రామానికి చెందిన హషీమ్.. గత నాలుగేళ్లుగా డ్రీమ్ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్​లో రూ.49 పెట్టి ఫాంటసీ గేమ్ ఆడాడు. మ్యాచ్​లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్​ను ఎంపిక చేసుకున్న అతడు.. ఫాంటసీ గేమ్​లో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో రూ.కోటి గెలుచుకున్నాడు.

dream 11 crore
హషీమ్

హషీమ్ రూ.కోటి గెలిచిన తర్వాత అతడి ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. అయితే, హషీమ్ కుటుంబ సభ్యులు దీనిపై ఏం మాట్లాడటం లేదు. హషీమ్, అతడి సోదరుడు కలిసి కారు కొనేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.