Haryana Violence News : హరియాణాలో హింస చెలరేగిన నేపథ్యంలో నూహ్, గురుగ్రామ్‌లో పోలీసులు భద్రతను మరింత పెంచారు. మంగళవారం రాత్రి కూడా ఆందోళనకారులు.. గురుగ్రామ్ సెక్టార్ 70 ప్రాంతంలో దుకాణాలు, ఆశ్రమాలకు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే చిన్నచిన్న ఘటనలు మినహా పెద్దగా ఎలాంటి ఘటనలు జరగలేదని గురుగ్రామ్ పోలీసులు వివరించారు. గురుగ్రామ్‌లో ఆంక్షలు విధించిన పోలీసులు.. విడిగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపైనా నిషేధం విధించారు.
Haryana Violence Death Toll : ఇరువర్గాల ఘర్షణల్లో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఆరుగురు మృతిచెందినట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు హోం గార్డులు, నలుగురు పౌరులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 116 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఘర్షణలకు కారణమైన దోషులను వదిలే ప్రసక్తే లేదని ఖట్టర్ తేల్చిచెప్పారు. ప్రజల భద్రతే ముఖ్యమన్న సీఎం ఖట్టర్.. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని వివరించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హరియాణాలో 20 పారామిలటరీ బలగాలు, 30 రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించామని అన్నారు. భద్రతా ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని ఖట్టర్ తెలిపారు.
దిల్లీ పోలీసులు అలర్ట్
హరియాణాలో హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రదేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 'హరియాణాలోని కొన్ని జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని సమస్యాత్మక ప్రదేశాల్లో భద్రతను పెంచాం. అవసరమైన చోట అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేశాం.' అని దిల్లీ పోలీసులు తెలిపారు.
-
#WATCH | Flag march by Rapid Action Force personnel in Badshahpur, Gurugram district following recent incidents of violence in Haryana pic.twitter.com/yt0gPiaDob
— ANI (@ANI) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Flag march by Rapid Action Force personnel in Badshahpur, Gurugram district following recent incidents of violence in Haryana pic.twitter.com/yt0gPiaDob
— ANI (@ANI) August 2, 2023#WATCH | Flag march by Rapid Action Force personnel in Badshahpur, Gurugram district following recent incidents of violence in Haryana pic.twitter.com/yt0gPiaDob
— ANI (@ANI) August 2, 2023
'పరిస్థితి అదుపులో ఉంది'
మరోవైపు.. హరియాణాలోని నూహ్‌లో చెలరేగిన అల్లర్లపై స్పందించారు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్. నూహ్‌లో పరిస్థితి అదుపులో ఉందని.. ఇప్పటివరకు 44 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు.' ఇప్పటివరకు ఘర్షణలకు కారణమైన 116 మందిని అరెస్టు చేశాం. ఇరువర్గాల ఘర్షణ వెనుక కుట్ర కోణం ఉంది. సమగ్ర విచారణ జరిపి.. ఘర్షణలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని తెలిపారు.