హరియాణలోని గుడ్‌గావ్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దౌలతాబాద్ సమీపంలో నిర్మాణంలో ఉన్న గుడ్‌గావ్-ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ఆదివారం ఉదయం 7.30 గంటలకు కుప్పకూలిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం- కానిస్టేబుల్ అరెస్ట్