ETV Bharat / bharat

'హరియాణాలోనూ 'లవ్​జిహాద్​' చట్టం' - హరియాణా

ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ తరహాలోనే బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావడానికి హరియాణా ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెడతామని రాష్ట్ర హోం మంత్రి అనిల్​ విజ్ ప్రకటించారు.

love jihad
'హరియాణాలోనూ 'లవ్​జిహాద్​' వ్యతిరేక బిల్లు'!
author img

By

Published : Feb 26, 2021, 12:50 PM IST

బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు చట్టాన్ని తీసుకురాగా.. తాజాగా హరియాణా ప్రభుత్వం కూడా సిద్ధమైంది. వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో 'లవ్​ జిహాద్​' బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు హరియాణా హోం మంత్రి అనిల్​ విజ్​ తెలిపారు.

"బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా ముసాయిదా బిల్లును రూపొందించాం. వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో ప్రవేశపెడతాం."

-అనిల్​ విజ్​, హరియాణా హోం మంత్రి

లవ్​జిహాద్​ బిల్లును రూపొందించడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు గతేడాది నవంబర్​26న అనిల్​ విజ్​ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు రూపొందించిన లవ్​జిహాద్​ చట్టాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు లవ్​జిహాద్​ చట్టాలను తీసుకొచ్చాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందు మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

యూపీ 'లవ్​ జిహాద్' ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం

'లవ్ జిహాద్' ఆర్డినెన్స్ తెచ్చిన మధ్యప్రదేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.