ETV Bharat / bharat

గోడ కట్టిన రైతులపై ఎఫ్​ఐఆర్​ నమోదు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై హరియాణా పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. జాతీయ రహదారిపై అక్రమంగా గోడ నిర్మాణం, బోర్​వెల్​ తవ్వకం చేపట్టినందుకుగాను వారిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

Haryana Police registers FIR against farmers for raising concrete wall on NH-44, digging borewell
గోడ కట్టిన రైతులపై ఎఫ్​ఐఆర్​ నమోదు
author img

By

Published : Mar 15, 2021, 9:08 AM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతులపై హరియాణా పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. సోనిపట్​ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై అక్రమంగా కాంక్రీట్​ గోడ నిర్మాణం చేపట్టడం, బోర్​వెల్ తవ్వకంపై ఈ కేసులు నమోదు చేశారు.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, స్థానిక అధికారుల ఫిర్యాదులతో సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని కుండ్లి ఇన్​స్పెక్టర్​ రవి కుమార్​ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే అక్రమ నిర్మాణాలు ఆపేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

కొంతమంది రైతులు రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి సింఘు సరిహద్దులోని నిరసన వేదిక సమీపంలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:'ఇది వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.