హరియాణా మంత్రి, భాజపా నేత కన్వర్ పాల్ గుజ్జర్.. రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు సహాయార్థం ఇచ్చే రూ.6,000 అనవసరమని, ఆ డబ్బుని వారు మద్యం కొనడానికి ఖర్చు చేస్తారని అన్నారు. బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా యమునానగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కన్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అంతేకాకుండా సాగు చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో చెప్పాలని కన్వర్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కలిగే లాభాల గురించి ఎవరితోనైనా మాట్లాడుతానని తెలిపారు.
ఇదీ చదవండి: రైతు ఉద్యమం షహీన్బాగ్లా కాదు: టికాయిత్