ETV Bharat / bharat

ఆరోగ్య మంత్రిపై కరోనా టీకా ప్రయోగం

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకాను తనపై ప్రయోగించుకునేందుకు సిద్ధమయ్యారు హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్​. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అంబాలా కాంట్​ సివిక్​ ఆస్పత్రిలో టీకా తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

Haryana Health Minister Anil Vij says he will be administered a trial dose of #Covaxin tomorrow
ఆరోగ్య మంత్రిపై కరోనా టీకా ప్రయోగం..
author img

By

Published : Nov 19, 2020, 6:05 PM IST

కరోనాను రూపుమాపడానికి భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకాను తనపై ప్రయోగించుకోనున్నారు హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్​. శుక్రవారం ఉదయం 11 గంటలకు అంబాలా కాంట్​ ఆస్పత్రిలో వ్యాక్సిన్​ డోస్​ను తీసుకోనున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్​లో ప్రకటించారు. పీజీఐ రోహ్​తక్ వైద్యుల బృందం సమక్షంలో ఈ ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలిపారు.

Haryana Health Minister Anil Vij says he will be administered a trial dose of #Covaxin tomorrow
అనిల్​ విజ్​ ట్వీట్​

కొవాగ్జిన్​ టీకా మూడో దశ ప్రయోగాల కోసం బుధవారమే.. వలంటీరుగా నమోదు చేయించుకున్నారు అనిల్​ విజ్​.

26 వేల మంది వాలంటీర్లు..

దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో చేసే ఈ ప్రయోగ పరీక్షల్లో 26 వేల మంది వలంటీర్లు పాలుపంచుకోనున్నారని భారత్​ బయోటెక్​ తెలిపింది. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమైనట్లు సంస్థ పేర్కొంది.

భారత వైద్య పరిశోధన మండలిశ(ఐసీఎంఆర్​) సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకా కోసం దేశంలో భారత్​ బయోటెక్​ చేపడుతోన్న అతిపెద్ద క్లినికల్​ పరీక్ష ఇదే కానుండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.