ETV Bharat / bharat

హరియాణాలో రాత్రి​ కర్ఫ్యూ- 'మహా'లో పరీక్షలు వాయిదా

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు వైరస్ నివారణ చర్యలు చేపడుతున్నాయి. కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. తాజాగా బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. హరియాణా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలులోకి తెచ్చింది. దిల్లీ యూనివర్సిటీ.. యూజీ, పీజీ విద్యార్థులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

new covid restrictions in different states
హరియాణాలో నైట్​ కర్ఫ్యూ- 'మహా'లో పరీక్షలు వాయిదా
author img

By

Published : Apr 13, 2021, 4:30 AM IST

హరియాణాలో కరోనా వ్యాప్తి ఆందోళకరంగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు మినహాయింపునిస్తూ.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే అంతర్రాష్ట్ర రాకపోకలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

దిల్లీలో మాస్కు లేకపోతే జరిమానా!

హరియాణా పొరుగున్న ఉన్న దిల్లీలోనూ కరోనా విజృంభిస్తోంది. ఆదివారం 92,397 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11,491 మందికి పాజిటివ్‌గా తేలింది. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కును తప్పనిసరి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానా విధించడం సహా కేసులు కూడా నమోదు చేస్తోంది.

యూజీ, పీజీ విద్యార్థులకు మార్గదర్శకాలు

కరోనా విజృంభణ నేపథ్యంలో దిల్లీ యూనివర్సిటీ.. యూజీ, పీజీ విద్యార్థులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లోనే తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే.. రీసెర్చ్‌ స్కాలర్లు, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు మాత్రం కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రత్యక్ష తరగతులకు హాజరుకావొచ్చు. ఈ మార్గదర్శకాలు దిల్లీ క్యాంపస్‌తోపాటు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లోనూ అమలు చేయనున్నారు. కళాశాల సిబ్బందిలో 50 శాతం మంది మాత్రమే హాజరు కావాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని దిల్లీ యూనివర్సిటీ.. మార్గదర్శకాల్లో పేర్కొంది. కంటైన్‌మెంట్‌ జోన్‌ వివరాలను విద్యార్థులు, సిబ్బంది ఎప్పటికప్పుడు కళాశాలకు అందివ్వాలని తెలిపింది.

మరోవైపు మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ఏప్రిల్​ 22 వరకు లాక్​డౌన్​ విధించింది.

మహారాష్ట్రలో బోర్డు పరీక్షలు వాయిదా..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో జరగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. 10వ తరగతి వార్షిక పరీక్షలు జూన్‌లో, 12వ తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్‌ సోమవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

"ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యం" అని వర్ష ట్వీట్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైరస్‌ పరిస్థితులను సమక్షించిన అనంతరం పరీక్షల తుది తేదీలను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. అంతేగాక.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్‌ బోర్డులు కూడా పరీక్షలపై పునఃపరిశీలనలు జరపాలని ఆమె ఈ సందర్భంగా ఆయా బోర్డులను కోరారు.

'మహా' సీఎం వరుస సమావేశాలు..

మరోవైపు రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం వరుస సమావేశాలు నిర్వహించారు. కొవిడ్‌ విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించాలని ఠాక్రే సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్నారు.

కోల్​కతా ఐఐఎంలో 61 మందికి కరోనా..

ఐఐఎం-కోల్‌కతా క్యాంపస్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత పదిరోజుల వ్యవధిలో 61 మంది విద్యార్థులకు మహమ్మారి సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరో 30 మంది విద్యార్థుల రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు వైరస్‌ వ్యాప్తి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని, కొవిడ్‌ లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు చెబుతున్నారు. వైరస్‌ సోకిన విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగానే ఉందని, వారి కోసం క్యాంపస్‌లోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని వివరించారు. అత్యవసర సమయంలో వీరికి సేవలు అందించేందుకు ముగ్గురు వైద్యులను నియమించారు.

ఇదీ చూడండి: కరోనాపై ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.