ETV Bharat / bharat

టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య - టిక్రి సరిహద్దు రైతు ఆత్మహత్య వార్తలు

సాగు చట్టాలపై ప్రతిష్టంభన మరో రైతును బలితీసుకుంది. హరియాణాకు చెందిన ఓ రైతు టిక్రీ సరిహద్దులో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన వదిలి వెళ్లిన సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Haryana farmer's body found hanging from tree near Tikri border protest site
టిక్రి సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య
author img

By

Published : Feb 7, 2021, 3:09 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్రీ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతును హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన కరమ్​వీర్ సింగ్​(52)గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం కరమ్​వీర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు.

రైతు ఓ సూసైడ్​ నోట్​ను వదిలి వెళ్లాడని, దాన్ని నిర్ధరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సాగు చట్టాలపై ప్రతిష్టంభన కారణంగానే రైతు మరణించినట్లు సూసైడ్ నోట్ ప్రకారం తెలుస్తోంది. 'రైతు సోదరులారా.. మోదీ ప్రభుత్వం(చర్చల కోసం) తేదీల మీద తేదీలను ప్రకటిస్తోంది. ఈ నల్ల సాగు చట్టాలను ఎప్పటికి వెనక్కి తీసుకుంటారో ఎవరికీ తెలీదు' అని నోట్ పేర్కొంది.

పదిహేను రోజుల క్రితం హరియాణాకు చెందిన ఓ రైతు కూడా టిక్రీ సరిహద్దు సమీపంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్​కు చెందిన ఓ న్యాయవాది, సిక్కు మతగురువు సంత్ రామ్ సింగ్ కూడా సాగు చట్టాల ఉపసంహరణపై ప్రతిష్టంభన నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఇదీ చదవండి: మరో ఉద్యమానికి టికాయత్​ పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.