హరియాణాలో సంచలనం సృష్టించిన నిఖితా తోమర్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న తౌసిఫ్, అతని స్నేహితుడు రెహన్‌లను దోషులుగా తేల్చింది ఫరీదాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. వారికి ఆయుధాన్ని సరఫరా చేసిన మూడో నిందితుడు అజ్రుద్దీన్ను నిర్దోషిగా ప్రకటించింది. దోషులకు మార్చి 26న శిక్ష ఖరారు చేయనుంది.
2020 అక్టోబర్ 26న నిఖితా తోమర్ అనే యువతి పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న సమయంలో వచ్చిన తౌసిఫ్ ఆమెను కాల్చి చంపాడు. మొదటగా నిందితుడు ఆమెను కారు ఎక్కించడానికి ప్రయత్నించాడు. నిఖిత ప్రతిఘటించిన కారణంగా తుపాకీతో కాల్చాడు. ఈ సంఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యింది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన.. హరియాణా ప్రభుత్వం 'లవ్ జిహాద్' చట్టం చేయాలని నిర్ణయం తీసుకునేలా చేసింది.
ఈ కేసులో పోలీసులు 700 పేజీల ఛార్జిషీట్‌ను 11 రోజుల్లో సమర్పించారు.