ETV Bharat / bharat

చండీగఢ్‌పై హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

Chandigarh Issue: చండీగఢ్​ను ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది హరియాణా అసెంబ్లీ. పంజాబ్​ తీర్మాణం నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైంది.

Chandigarh Issue
మనోహర్​ లాల్​ ఖట్టర్
author img

By

Published : Apr 5, 2022, 4:30 PM IST

Chandigarh Issue: కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పై వివాదం మరింత రాజుకుంటోంది. పంజాబ్‌, హరియాణాల ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌ను తమకు బదిలీ చేయాలని పంజాబ్ అసెంబ్లీ​ తీర్మానించిన నేపథ్యంలో హరియాణా సైతం కీలక నిర్ణయం తీసుకుంది. చండీగఢ్​ను ఉమ్మడి రాజధానిగా యథాతథంగా కొనసాగించాలని హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన విపక్షాలకు ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్ ధన్యవాదాలు తెలిపారు. పంజాబ్​ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. ఇది హరియాణా ప్రజలకు ఆమోదయోగ్యం కాదన్నారు.

మూడు గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. ఈ తీర్మానంతో పాటు సట్లెజ్​- యమునా లేక్​ నిర్మాణం, హిందీ మాట్లాడే రాష్ట్రాల జాబితాలో హరియాణాను చేర్చే అంశాలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చండీగఢ్​పై పంజాబ్​ తీర్మానం నేపథ్యంలో హరియాణా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. చండీగఢ్‌ కేంద్ర పాలిత ఉద్యోగులకు సెంట్రల్‌ సర్వీస్‌ నిబంధనలు వర్తిస్తాయంటూ గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ ప్రకటనతోనే ఇరు రాష్ట్రాల్లో ఈ వివాదం మొదలైంది.

ఇదీ చదవండి: 'ఉమ్మడి రాజధానిని మా రాష్ట్రానికి బదిలీ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.