ఝార్ఖండ్‌లో 2007లో జరిగిన చిల్క్హరీ ఘటనలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు కోల్హా యాదవ్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడిని బిహార్‌లోని జముయీ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఝార్ఖండ్‌లోని గిరిధి జిల్లా భేల్వఘతి ఠాణాకు చెందిన బృందం బిహార్ పోలీసుల సాయంతో నిందితుడిని పట్టుకుంది.
నిందితుడిపై 18పైగా కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
గిరిధి జిల్లా చిల్క్హరీలో 2007లో జరిగిన నక్సల్స్ కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి కుమారుడు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి : 'నలుగురిని కాదు.. 8 మందిని కాల్చి చంపాల్సింది'