New Year 2024 Wishes Telugu : 2023 సంవత్సరానికి సెండాఫ్ ఇచ్చే టైం వచ్చేసింది. 2024కి స్వాగతం పలికేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త ఏడాది అంటే కొత్త ఆశలు.. ఆలోచనలు.. ఆశయాల కలబోత! రాబోయే ఈ ఏడాదిలో జీవితం అద్భుతంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమవాళ్ల లైఫ్ కూడా లగ్జరీగా సాగిపోవాలని ఆశిస్తుంటారు. ఇందుకోసం మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
అయితే.. ఈ కోరికను గతంలో గ్రీటింగ్ కార్డుల రూపంలో వ్యక్తపరిచేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. అంతా డిజిటల్‌మయం కావడంతో.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే.. మీరు రొటీన్‌గా "హ్యాపీ న్యూఇయర్" అని కాకుండా.. హృదయాన్ని తాకేలా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు స్పెషల్ గ్రీటింగ్స్ చెప్పండి. ఇందుకోసమే "ఈటీవీ భారత్" స్పెషల్ విషెస్ అందిస్తోంది. వాటిపై ఓ లుక్కేయండి..!
Happy New Year 2024 Wishes Telugu:
- సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతుంటాయి.. సంఖ్య మారుతూ ఉంటుంది. కానీ మీ ఆశయం నెరవేరిన రోజును కాలం గుర్తు పెట్టుకుంటుంది. అది ఈ సంవత్సరమే కావాలని ఆశిస్తున్నా.. Happy New Year 2024
- కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త ఆలోచనలతో మీరు తలపెట్టిన ప్రతిపనీ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ న్యూ ఇయర్..
- కొత్త సంవత్సరంలో మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆశిస్తూ.. Happy New Year
- నూతన సంవత్సరం మీ జీవితంలో ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలి పోవాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్
- కొత్త సంవత్సరంలో మీరు తలపెట్టిన ప్రతి పనీ విజయం సాధించాలని కోరుకుంటూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
- నూతన సంవత్సరం మీకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చి అన్నింటా విజయం అందించాలని ప్రార్థిస్తూ Happy New Year 2024
- 2024 ఆంగ్ల సంవత్సరాది మీ కుటుంబానికి అన్ని సుఖసంతోషాలూ అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
- సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుకుంటూ.. Happy New Year
- ఈ సంవత్సరం మీకు నిత్య వసంతంలా గడిచిపోవాలని.. విజయం మిమ్మల్ని వరించాలని ప్రార్థిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
- ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి జరగాలని.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను సోపానాలుగా మలచి విజయం సాధించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్
న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీస్ - ఈ వెరైటీస్‌తో పార్టీ అద్దిరిపోద్ది!
New Year 2024 Quotes:
- ఉప్పొంగిన ఉత్సాహంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం.. అవధుల్లేని ఉత్సాహంతో పండగ చేద్దాం.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
- కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.. జీవితంలో విజయం వైపు అడుగులు వేద్దాం.. హ్యాపీ న్యూ ఇయర్ 2024
- పాత విజయాలను గుర్తు చేసుకుంటూ.. కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలవైపు దూసుకెళ్తూ అన్నింటా విజయం సాధిద్దాం.. Happy New Year 2024
- గతం గతః.. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి జయకేతనాలను ఎగురవేద్దాం.. హ్యాపీ న్యూ ఇయర్
- ఉప్పొంగే ఉత్సాహంతో.. అవధులు లేని ఆనందంతో.. అంబరాన్నంటే సంబరాలతో.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.. సంతోషంగా ఉందాం.. హ్యాపీ న్యూ ఇయర్ 2024
- ప్రకృతి అందం.. సున్నితమైన భావం.. అందమైన మనసును.. కేవలం కొత్త సంవత్సరంలోనే కాకుండా.. జీవితాంతం ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం... Happy New Year 2024
- నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచించి లక్ష్యాలు సాధిద్దాం.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
న్యూ ఇయర్ విషెస్ - ఈసారి కొత్త భాషలో చెప్పండి!
న్యూ ఇయర్ తీర్మానం: మీ డైరీలో అవి ఉంటే - మీ డైట్లో ఇవి ఉండాలి!
కొత్త సంవత్సరంలో ఫైనాన్షియల్ గోల్స్ - ఇలా సెట్ చేసుకుంటే తిరుగుండదు!