ETV Bharat / bharat

Nal hansa: గాల్లో చక్కర్లు కొట్టిన కొత్త తరం విమానం 'హన్స'! - హన్స ఎన్​జీ

బెంగళూరులోని.. సీఎస్​ఐఆర్​-ఎన్​ఏఎల్​ అభివృద్ధి చేసిన కొత్త తరం ఎయిర్​క్రాఫ్ట్​ 'హన్స' (Nal hansa) తొలిసారి ఆకాశంలోకి విజయవంతంగా ఎగిరింది. ఈ ప్రయోగం ఎన్​ఏఎల్​కు మైలురాయిగా నిలవనుందని సీఎస్​ఐఆర్ డైరెక్టర్ జనరల్​ శేఖర్​ సీ మాండే పేర్కొన్నారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో నడిచే విధంగా ఈ విమానాన్ని రూపొందించామని అధికారులు వెల్లడించారు.

hansa aircraft, హన్స ఎయిర్​క్రాఫ్ట్​
Nal hansa: కొత్త జెనరేషన్ విమానాన్ని రూపొందించిన ఎన్​ఏఎల్
author img

By

Published : Sep 3, 2021, 10:05 PM IST

సీఎస్​ఐఆర్​- నేషనల్​ ఎయిరోస్పేస్​ ల్యాబొరేటరీస్ ఓ కొత్త తరం ఎయిర్​క్రాఫ్ట్​ను రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన 'హన్స' ఎయిర్​క్రాఫ్ట్​ (Nal hansa) బెంగళూరులోని హిందుస్థాన్​ ఎరోనాటిక్స్​ లిమిటెడ్​కు చెందిన ఎయిర్​పోర్ట్​లో శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. 80 నాట్​ల (148 కిలోమీటర్లు) వేగంతో అత్యధికంగా 4000 అడుగుల ఎత్తులో ఈ విమానం ప్రయాణించింది. కెప్టన్ అమిత్​ దాహియా.. ఈ విమానానికి టెస్ట్​ పైలట్​గా వ్యవహరించారు.

  • #WATCH | Hansa New Generation (NG) aircraft, designed and developed by CSIR-NAL, Bangalore, successfully made its maiden flight from HAL airport today. The aircraft flew at an altitude of 4000 ft. and gained a speed of 80 knots before it made a successful landing. pic.twitter.com/NGkcVC2Q58

    — ANI (@ANI) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డీజీసీఏ, సీఈఎంఐఎల్​ఏసీ, సీఎస్​ఐఆర్-ఎన్​ఏఎల్​ సంస్థలకు చెందిన సీనియర్​ అధికారులు, శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. హన్స-ఎన్​జీ విమాన ప్రయోగం ఎన్​ఏఎల్​కు మైలురాయిగా నిలవనుందని సీఎస్​ఐఆర్ డైరెక్టర్ జనరల్​ శేఖర్​ సీ మాండే పేర్కొన్నారు. ఈ విమానాల తయారీలో భాగస్వామ్యం కోసం ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థను సంప్రదించామని.. త్వరలోనే తయారీ ప్రారంభం అవుతుందని తెలిపారు.

తక్కువ నిర్వహణ ఖర్చుతో నడిచే విధంగా ఈ విమానాన్ని రూపొందించామని అధికారులు వెల్లడించారు. హన్స​-ఎన్​జీ కొనుగోలుపై ఇప్పటికే పలు ఫ్లయింగ్​ క్లబ్​లు తమను సంప్రదించాయని తెలిపారు. మరో నాలుగు నెలల్లో ఈ ఎయిర్​క్రాఫ్ట్​కు ధ్రువీకరణ లభిస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : ఆ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పురందేశ్వరి వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.