కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాసవాన్ మృతిపై హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. పాసవాన్ కుమారుడు, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ తీరుపై సందేహాలు ఉన్నాయని తెలిపింది.
"పాసవాన్ మృతితో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. కానీ, ఆయన అంత్యక్రియలు జరిగిన మరుసటిరోజు జరిగిన వీడియో చిత్రీకరణలో చిరాగ్ నవ్వుతూ కనిపించారు. షూటింగ్ చేసే విధానంపై ఆయన మాట్లాడుతూ కనిపించారు. చిరాగ్ తీరుతో రామ్ విలాస్ అనుచరులు, బంధువుల్లో అనుమానాలు మొదలయ్యాయి."
- హిందుస్థానీ అవామ్ మోర్చా
"ఎవరి ఆదేశాలతో రామ్‌విలాస్ చేరిన ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు? ఎవరు చెబితే ఆసుపత్రిలో పాసవాన్‌ను కలిసేందుకు ముగ్గురిని మాత్రమే అనుమతించారు? ఆయన మృతిపై ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి." అని హెచ్ఏఎం లేఖలో పేర్కొంది.
ఖండించిన చిరాగ్..
ఇలాంటి ఆరోపణలు చేసేవారు సిగ్గుపడాలని తీవ్రంగా స్పందించారు చిరాగ్. హెచ్ఏఎం అధినేత జీతన్ రామ్ మాంఝీకి తన తండ్రి ఆరోగ్యం గురించి చెప్పానని, అయినా ఆయన చూడటానికి రాలేదని చెప్పారు. తన తండ్రి మృతిపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
వీడియో వైరల్..
ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న పాసవాన్.. అక్టోబర్ 8న కన్నుమూశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. పాసవాన్ ఫొటో ఎదుట చిరాగ్ మాట్లాడుతున్నట్లు ఫొటో షూట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఫొటోగ్రాఫర్‌కు సూచనలు ఇస్తున్న చిరాగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
-
Chirag Paswan performs in front of his late father's portrait. He should get a stab in Bollywood! pic.twitter.com/sAXBJxnRFE
— Prashant Bhushan (@pbhushan1) October 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chirag Paswan performs in front of his late father's portrait. He should get a stab in Bollywood! pic.twitter.com/sAXBJxnRFE
— Prashant Bhushan (@pbhushan1) October 27, 2020Chirag Paswan performs in front of his late father's portrait. He should get a stab in Bollywood! pic.twitter.com/sAXBJxnRFE
— Prashant Bhushan (@pbhushan1) October 27, 2020
విమర్శలు..
తన తండ్రి గురించి మాట్లాడేటప్పుడు చిరాగ్ బాధపడలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శించాయి. అయితే, తన తండ్రి విషయంలో తానెంత బాధపడ్డాననే విషయాన్ని ఎవరికీ రుజువు చేయాల్సిన అవసరం తనకు లేదని చిరాగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇలాంటి తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని మండిపడ్డారు.
ఇదీ చూడండి: 'నా గుండెలు చీల్చి చూడండి.. మోదీ కనిపిస్తారు'