Gyanvapi Survey Evidences : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిగిన శాస్త్రీయ సర్వేకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసిన పనిలో నిమగ్నయమయ్యారు ఏఎస్‌ఐ అధికారులు. నవంబరు 17వ తేదీలోగా ఏఎస్‌ఐ తన నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉండగా.. సర్వేకు చెందిన 300కు పైగా ఆధారాలను ఏఎస్‌ఐ అధికారులు.. అదనపు జిల్లా అధికారికి అప్పగించారు.
Gyanvapi Mosque Survey Report : ఇప్పటి వరకు ట్రెజరీలోని డబుల్ లాకర్లో 250కిపైగా సర్వేకు సంబంధించిన ఆధారాలను జమచేయగా.. మరికొన్ని మంగళవారం డిపాజిట్ చేయనున్నారు. చాలా ఏళ్ల నాటి బొమ్మలు, మతపరమైన చిహ్నాల భాగాలు, కిటీకీలు, తలుపులు, కళాఖండాల గుర్తులు తదితర వస్తువులను ట్రెజరీలో నిక్షిప్తం చేశారు.
![Gyanvapi Survey Evidences](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2023/up-var-1-gyanvapi-sakhaya-7200982_07112023082816_0711f_1699325896_653.jpg)
Gyanvapi Mosque Survey Findings : అయితే సర్వేలో స్వాధీనం చేసుకున్న వాటిని భద్రపరచడం వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యతేనని ఇటీవలే కోర్టు.. జిల్లా కలెక్టర్ రాజలింగానికి ఆదేశాలు జారీ చేసింది. వాటిని భద్రపరిచేందుకు ఒక అధికారిని నియమించుకోవచ్చని చెప్పింది. అన్ని వస్తువులను భద్రంగా కాపాడాలని ఆదేశించింది. ట్రెజరీలో జమ చేసిన వస్తువుల జాబితాను కూడా ఏఎస్‌ఐ అధికారులు తయారు చేశారు. ఏ వస్తువును.. ఎప్పుడు డబుల్ లాకర్లో భద్రపరిచారో నమోదు చేసుకున్నారు. నివేదికతోపాటు జాబితా కాపీను కూడా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధం చేశారు.
![Gyanvapi Survey Evidences](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2023/up-var-1-gyanvapi-sakhaya-7200982_07112023082816_0711f_1699325896_1050.jpg)
Gyanvapi Mosque Survey Update : మొగల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞాన్వాపి మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని శాస్త్రీయ సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది.
![Gyanvapi Survey Evidences](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2023/up-var-1-gyanvapi-sakhaya-7200982_07112023082816_0711f_1699325896_481.jpg)
దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింగా.. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఏఎస్‌ఐ సర్వే కొనసాగించేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో నవంబరు 2వ తేదీవరకు శాస్త్రీయ సర్వే చేపట్టారు అధికారులు.
'జ్ఞాన్వాపి మసీదులో బయటపడిన శివలింగం!'
జ్ఞాన్వాపి సర్వేలో సంచలన నిజాలు.. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు!