ETV Bharat / bharat

'నా భార్య మహిళ కాదు.. పురుషుడు'.. పెళ్లైన ఆరేళ్లకు కోర్టును ఆశ్రయించిన భర్త

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో వింత ఘటన జరిగింది. తన భార్య మహిళ కాదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు ఓ భర్త. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ వివాహాన్ని రద్దు చేసింది.

man alleges his wife is not woman
Gwalior Husband knock SC
author img

By

Published : Oct 1, 2022, 1:56 PM IST

ఓ వ్యక్తి తన భార్యతో ఆరేళ్లు కాపురం చేశాక ఆమె మహిళ కాదు పురుషుడు అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది. తనను మోసం చేసిందంటూ మహిళతో పాటు ఆమె తండ్రిపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వీరిపై చీటింగ్​ కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఈ విషయాన్ని హైకోర్టు కొట్టి పారేసింది. మరోవైపు ఈ కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం ఈ వివాహాన్ని రద్దు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్​కు చెందిన యువకుడికి మురైనాకు చెందిన యువతితో 2016లో వివాహం జరిగింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు. ఆ యువకుడు అడిగినా ఆమె ఒప్పుకోలేదు. ఆరేళ్ల తర్వాత తన భార్య మహిళ కాదని పురుషుడని ఆరోపిస్తున్నాడు యువకుడు. దీంతో భర్త కోర్టును ఆశ్రయించాడు. తనకు హార్మోన్​ సమస్య ఉండడం వల్లే ఇలా ఉన్నాని.. ఈ సమస్యకు చికిత్స సైతం తీసుకుంటున్నానని తెలిపింది. అయినా అనుమానం తీరని భర్త వైద్య పరీక్షలు​ చేయించాడు. ఫలితంగా ఆమె పురుషుడని తేలింది. దీనిపై విచారించిన కుటుంబ న్యాయస్థానం ఈ వివాహాన్ని రద్దు చేసింది.

ఇదీ చదవండి: దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. 5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని

మైనర్​పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.