ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తిని బతికుండగానే వైద్యులు మృతిచెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టంకు కూడా తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్‌వతి రాజ్‌పుత్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను ఝాన్సీలోని ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం గురువారం రాత్రి గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు.. ఆమె మృతిచెందినట్లు శుక్రవారం ఉదయం నిర్ధరించారు. పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. అయితే రామ్‌వతి శ్వాసతీసుకుంటున్నట్లు భర్త నిర్పత్ సింగ్ గుర్తించారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది బాధితురాలికి చికిత్స అందించారు.
ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ ఆర్కేఎస్ ధాకడ్ వెల్లడించారు.
ఇదీ చూడండి : చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స.. ప్రాణాలు నిలిపిన వైద్యులు