ETV Bharat / bharat

ప్రధానికి లేఖ రాసిన చిన్నారి- ఎందుకంటే...

దేశంలో ఇటీవల మహిళలు, చిన్నారులపై వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కీచకుల ధాటికి ఎందరో అమాయకులు బలవుతున్నారు. వీటిని చూసి విసుగెత్తిన ఓ విద్యార్థిని.. ప్రధాన మంత్రికి లేఖ రాసింది. తనకు తెలిసిన ఓ పరిష్కార మార్గాన్ని సూచించింది. ఇంతకీ అందులో ఆ చిన్నారి ఏం రాసిందంటే..

Guwahati girl writes to Modi seeking free self defence courses for girls
ప్రధానమంత్రికి లేఖ రాసిన చిన్నారి.. ఎందుకంటే?
author img

By

Published : Nov 20, 2020, 7:21 PM IST

Updated : Nov 20, 2020, 8:02 PM IST

ప్రధానికి లేఖ రాసిన చిన్నారి- ఎందుకంటే...

మహిళలు, చిన్నారులపై దేశంలో జరుగుతున్న అకృత్యాలకు చలించిన ఓ బాలిక ఏకంగా.. ప్రధాన మంత్రికి ఉత్తరం రాసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థినులకు స్వీయ రక్షణలో ఉచిత శిక్షణ ఇప్పించాలని కోరింది.

అసోం గువాహటి నగరంలోని పాండు ప్రాంతానికి చెందిన డాక్టర్​ మనోజిత్ ​కుమార్తె 15 ఏళ్ల 'మీనాక్షి సింగా'. ప్రాగ్జ్యోతిశ్​ సీనియర్​ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె ఓ వుషూ క్రీడాకారిణి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను చూసి ఆందోళనకు గురైన ఆ బాలిక.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నవంబర్​ 18న లేఖ రాసింది.

Guwahati girl writes to Modi seeking free self defence courses for girls
ప్రధానమంత్రికి లేఖ

"సర్​. చాలా కాలం నుంచి నేను ఆలోచిస్తున్న దానిని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నందున దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో బాలికలకు స్వీయ రక్షణలో ఉచితంగా శిక్షణ ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలా చేస్తే అమ్మాయిలు ధైర్యంగా ఉండగలుగుతారు. ఆపద సమయాల్లో తమని తాము కాపాడుకోగలుగుతారు. నేనో 'ఉషూ' క్రీడాకారిణిని. మా మాస్టర్​ గోపీ సింగ్​ సహకారంతో ప్రతి ఆదివారం మా ప్రాంతంలోని అమ్మాయిలకు నేను ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను."

-- మీనాక్షి సింగా, తొమ్మిదో తరగతి విద్యార్థిని.

మీనాక్షి సింగా

ఈ విషయంలో తనకు సమాధానం పంపాల్సిందిగా.. ప్రధాన మంత్రిని లేఖలో వేడుకుంది మీనాక్షి. మరి ఆమె విజ్ఞప్తిపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇదీ చూడండి:పెంపుడు శునకం కోసం యువతి బలవన్మరణం!

Last Updated : Nov 20, 2020, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.