ETV Bharat / bharat

ప్రధాని మోదీ కీలక ప్రకటన- ఇకపై ఏటా డిసెంబర్​ 26న.. - Guru Gobind Singh Jayanti news

Guru Gobind Singh Jayanti: సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్.. ఆయన్ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక ప్రకటన చేశారు.

Guru Gobind Singh Jayanti
గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతి
author img

By

Published : Jan 9, 2022, 10:47 AM IST

Updated : Jan 9, 2022, 3:08 PM IST

Guru Gobind Singh Jayanti: 10వ సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేసిన మోదీ.. ఇకపై ఏటా డిసెంబర్​ 26న 'వీర్​ బాల్​ దివస్'​ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

మొఘలులు ఉరితీసిన గురు గోవింద్​ సింగ్​ నలుగురు కుమారులకు (సాహిబ్జాదా) ఇదే ఘనమైన నివాళి అని మోదీ అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సాహిబ్జాదా జొరావర్​ సింగ్​, సాహిబ్జాదా ఫతేసింగ్​లను స్మరిస్తూ వీర బాలల దినోత్సవం నిర్వహించనున్నట్లు ట్వీట్​ చేశారు. వీరు వీర మరణాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు.

''మాతా గుజ్రీ, శ్రీ గురు గోవింద్​ సింగ్​, వారి నలుగురు సాహిబ్జాదాల ధైర్యసాహసాలు, ఆలోచనలు.. కోట్లాది ప్రజలకు బలాన్ని చేకూర్చుతాయి. వారెప్పుడూ అన్యాయానికి తలవంచలేదు. వారి గురించి ప్రజలు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

గతంలో పట్నాలో గురుగోవింద్ సింగ్​కు నివాళులు అర్పించిన ఫొటోలను మోదీ షేర్ చేశారు.

PM Modi tweet
ప్రధాని మోదీ ట్వీట్
Guru Gobind Singh Jayanti
సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్​కు మోదీ నివాళులు
Guru Gobind Singh Jayanti
సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్ చిత్రాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ

" గురు గోవింద్​ సింగ్​ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. గురు జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుంది. 350వ ప్రకాశ్ పురబ్​ను ఘనంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా."

-- ప్రధాని నరేంద్ర మోదీ

రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​ కూడా ప్రకాశ్ పురబ్ సందర్భంగా​ శుభాకాంక్షలు తెలిపారు.

rajnath singh tweet
రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ ట్వీట్​
Guru Gobind Singh Jayanti
దిల్లీలోని గురుద్వారా సిస్​గంజ్​ సాహిబ్

"శ్రీ గురు గోవింద్ సింగ్ 355వ​ జయంతి సందర్భంగా నేను ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ధైర్యసాహసాలకు ఆయన పెట్టింది పేరు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందాయి. ఆయన సందేశాలు, త్యాగాలు మన సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది."

-- రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్

ప్రకాశ్ పురబ్(గురు గోవింద్​ సింగ్​ జయంతి) సందర్భంగా వారాంతపు కర్ఫ్యూలో భక్తులకు సడలింపు ఇచ్చింది దిల్లీ ప్రభుత్వం.

ప్రకాశ్ పురబ్​ను పురస్కరించుకుని భక్తులు దిల్లీలోని గురుద్వారా సిస్​గంజ్​ సాహిబ్ మందిరానికి తరలివస్తున్నారు. అటు పంజాబ్, అమృత్​సర్​లోని స్వర్ణదేవాలయానికీ భక్తుల తాకిడి పెరిగింది.

Guru Gobind Singh Jayanti
దిల్లీలోని గురుద్వారా సిస్​గంజ్​ సాహిబ్​లో భక్తులు

ఇదీ చూడండి: ఆసక్తి రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. యూపీపైనే అందరి కళ్లు

Last Updated : Jan 9, 2022, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.