ETV Bharat / bharat

పొడవైన కేశాలతో హ్యాట్రిక్ కొట్టిన యువతి

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేశాలున్న టీనేజర్​గా గుజరాత్​కు చెందిన యువతి ఘనత సాధించింది. ఆమె వెంట్రుకల పొడవు ఏకంగా 6 అడుగుల 6.7 అంగుళాలుగా నమోదైంది. చదువులోనూ ఈ యువతి ప్రతిభ కనబరుస్తోంది. ఐఐటీలో సీటు సంపాదించడమే కాక... క్రీడలు, డ్యాన్స్, స్విమ్మింగ్ వంటి విభాగాల్లోనూ సత్తా చాటుతోంది.

Gujarat's Nilanshi has set a record for being the longest haired teenager in the world
పొడవైన కేశాలతో హ్యాట్రిక్ కొట్టిన యువతి
author img

By

Published : Nov 9, 2020, 1:03 PM IST

Updated : Nov 9, 2020, 7:49 PM IST

పొడవైన కేశాలతో హ్యాట్రిక్ కొట్టిన యువతి

గుజరాత్​ అరవల్లి జిల్లాకు చెందిన నీలాన్షీ పటేల్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే పొడవైన కేశాలు ఉన్న టీనేజర్​గా వరుసగా మూడోసారి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ యువతి వెంట్రుకల పొడవు ఆరు అడుగుల 6.7 అంగుళాలకు చేరింది.

పొడవైన శిరోజాలు ఉన్న టీనేజర్​గా 2018లో తొలిసారి ఈ ఫీట్ సాధించిన నీలాన్షి... 2019, 2020లోనూ తన రికార్డు నిలుపుకొని హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ మూడేళ్లలో ఆమె జుట్టు ఒక అడుగు మేర పెరిగింది. 2018లో ఆమె కేశాల పొడవు 5 అడుగుల ఏడు అంగుళాలు.

చదువులోనూ నీలాన్షి ప్రతిభ చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 107వ ర్యాంక్ సాధించింది. గాంధీనగర్​ ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ సీటు సంపాదించింది.

ఆటల్లోనూ ఈ కేశ సుందరి సత్తా చాటుతోంది. జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్​ ప్లేయర్​గా రాణిస్తోంది. అంతేకాదు డ్యాన్స్, స్విమ్మింగ్, స్కేటింగ్​లోనూ నీలాన్షికి ప్రావీణ్యం ఉంది.

Last Updated : Nov 9, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.