కరోనా కేసుల సంఖ్య పెరగడం వల్ల ఆసుపత్రులలో పడకలు సరిపోవడం లేదు. ఉన్నా.. కొన్ని ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేవు. దీన్ని గమనించిన గుజరాత్‌లోని బనాస్కాంఠ జిల్లా తేతోడా గ్రామంలోని రాజారాం గోశాల యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంది. గోశాలను కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది.
![Gaushala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:03:42:1620657222_gaushala_isolation_center_1_1005newsroom_1620656599_905.jpg)
"రోగులకు వైద్యం చేయడానికి ఒక ఆయుర్వేద, ఒక అల్లోపతి వైద్యులు ఉన్నారు. వారితో పాటు ఐదుగురు నర్సులు ఉండి రోగులకు చికిత్స అందిస్తున్నారు" అని గోశాల యజమాని రామ్‌రతన్ మహరాజ్ తెలిపారు.
ఇక్కడ కొవిడ్ రోగులకు ఆయుర్వేదం, అల్లోపతి వైద్యం కూడా అందిస్తారు. చికిత్సలో పాంచగవ్య(ఆవు పాలు, నెయ్యి, గోమూత్రంతో తయారు చేసినది) వాడతారు. రోగనిరోధక శక్తి పెరగడం కోసం రసాయననాలు వాడని సేంద్రియ ఆహారం ఇస్తారు. రోగులకు ఎండ నుంచి ఉపశమనం కోసం గోశాల కప్పుపై గడ్డిపరిచారు.
![Gaushala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:03:41:1620657221_gaushala_isolation_center_2_1005newsroom_1620656599_1046.jpg)
![Gaushala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:03:40:1620657220_gaushala_isolation_center_3_1005newsroom_1620656599_675.jpg)
ఇక్కడ 50బెడ్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి కరోనా రోగి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళతారు. దాంతో ఈ గోశాలపై చాలా మందికి నమ్మకం పెరిగింది. జిల్లాకు సమీపంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రం నుంచి కరోనా రోగులు చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారు.
ఇదీ చదవండి: 'కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం!'