వినాయక చతుర్థి(Ganesh Chaturthi) వచ్చేసింది. భక్తులంతా వినాయకుని ప్రతిమలను(Ganesh Idols) మండపాల్లో పెట్టి కొలుస్తున్నారు. అయితే.. మనమంతా పెట్టుకునే ఈ గణేశుడి విగ్రహాల ఖర్చు మహా అయితే.. రూ.వేలల్లో లేదంటే లక్షల్లో మాత్రమే ఉంటుంది. కానీ, వందల కోట్ల రూపాయల ధర పలికే గణేశుని విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా? లేదంటే.. గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాల్సిందే!
సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి కానూ అసోదారియా ఇంట్లో ప్రపంచంలోనే అరుదైన ఓ గణేశుని విగ్రహం(Rare Ganesha Statue) ఉంది. ముడి వజ్రంతో(Diamond Ganesh) చేసింది కావడమే దీని ప్రత్యేకత. ఈ విగ్రహం ధర దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వజ్రమైన కోహినూర్ డైమండ్ 105 క్యారట్లతో ఉండగా.. ఈ గణేశుని విగ్రహం 182.3 క్యారట్లతో 36.5 గ్రాముల బరువుతో ఉండటం విశేషం. ఈ వజ్రపు గణేశుని ప్రతిమ.. కోహినూర్ వజ్రం కంటే పరిమాణంలోనూ పెద్దది కావడం మరో ప్రత్యేకత.
ఈ విగ్రహాన్ని కానూ అసోదారియా 'కర్మ గణేశ' పేరుతో పిలుస్తున్నారు. దీనికి.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్స్లోనూ(World Book Of Records India) స్థానం దక్కింది.
ఎక్కడి నుంచి తెచ్చారంటే?
తాను 2002లో బెల్జియం నుంచి ఈ అరుదైన వజ్రపు గణేశుని(Diamond Ganesh) ప్రతిమను తీసుకువచ్చానని చెప్పారు అసోదారియా.
"2002లో ముడి వజ్రాలను కొనుగోలు చేసేందుకు బెల్జియం వెళ్లినప్పుడు ఈ అరుదైన వజ్రాన్ని చూశాను. ఈ వజ్రాన్ని నేను కొనుగోలు చేసినప్పుడు.. మా తండ్రి కలలో విజ్ఞేశ్వరుడు కనిపించాడు. ఆ తర్వాతే ఈ వజ్రం.. వినాయకుడికి ప్రతిరూపం అని తెలుసుకోగలిగాం. ఈ గణేశుని ప్రతిమ మన దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతో పేరు సంపాదించింది. ఈ వినాయకుడిని చూసి, ఆశీస్సులు తీసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
-కానూ అసోదారియా, వజ్రాల వ్యాపారి.
కమలా హారిస్ కూడా..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ 'కర్మ గణేశు'ని(Rare Ganesha Statue) ప్రతిమను చూడాలనుకున్నారని కానూ అసోదారియా తెలిపారు. ఆమెకు ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలను పంపుతానని చెప్పారు. ఈ 'కర్మ గణేశుని' చిత్రాలను పెట్టుకున్నవారికి అదృష్టం కలిసి వస్తుందన్న అసోదారియా... అమితాబ్ బచ్చన్, నితిన్ గడ్కరీ, బాబా రామ్‌దేవ్, అమిత్ షా సహా 25 మంది ప్రముఖులకు ఈ ఫొటోలు పంపించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: భారతీయులకు 'స్వాతంత్య్రం' రుచి చూపిన గణపతి!
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ్ నవరాత్రి వేడుకలు