ETV Bharat / bharat

పెట్రోల్​, విద్యుత్​.. రెండింటితో నడిచే బైక్ ఇది​.. - Student made special bike

పెట్రోల్‌ ధరలు అమాంతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. విద్యుత్‌తో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు! ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు పెట్రోల్‌తో పాటు విద్యుత్‌తో నడిచే బైక్‌ను తయారు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

motorbike that can run on both petrol and electricity
పెట్రోల్​, విద్యుత్​లతో నడిచే బైక్​
author img

By

Published : Jul 22, 2021, 6:33 AM IST

పెట్రోల్​, విద్యుత్​లతో నడిచే బైక్​

చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించడానికి పలువురు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఆవిష్కరణలు కూడా చేస్తున్నారు. గుజరాత్​లోని రాజ్​కోట్​లో ఉన్న వీవీపీ ఇంజినీరింగ్​ కాలేజీ విద్యార్థులు ఈ కోవకు చెందిన వారే. పెట్రోల్​, విద్యుత్​.. ఇలా రెండింటి మీదా నడిచే ఓ హైబ్రిడ్ బైక్​ను తయారు చేశారు. మెకానికల్​ విభాగంలో ఫైనల్​ ఇయర్​ చదువుతున్న పాండియ రుచిత్​ భవద్వేష్​, మాకడియా నిర్మల్​ జయేష్, జాలా సతీష్​ భరత్​.. ప్రొఫెసర్​ హర్దిక్​పుర్​ పర్యవేక్షణలో ఈ బైక్​ను రూపొందించారు.

విద్యుత్​ వాహనాలు వస్తున్నా..

అందుబాటులోకి ఎలక్ట్రిక్​ వాహనాలు వస్తున్నా.. వాటితో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అధిక ధర, తక్కువ రేంజ్​, స్లో ఛార్జింగ్​ సహా సరిపడా ఛార్జ్​ స్టేషన్స్​ అందుబాటులో లేకపోవడం వంటివి.. ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ వినియోగంపై సందేహాలను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకే విద్యార్థులు ఈ సెమీ ఎలక్ట్రిక్​ బైక్​ను తయారు చేశారని ఆ కాలేజీ మెకానికల్​ విభాగం హెడ్​ డాక్టర్​ నీరవ్​ మణియర్​ వెల్లడించారు.

ఈ బైక్​ తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని, ఒక నెల పాటు దీనిని పరీక్షించామంటున్నారు విద్యార్థులు.

"ఈ బైక్​ను పెట్రోల్​, బ్యాటరీ సాయంతో నడిచేలా రూపొందించాం. వాహనదారుల సులువు కోసం రెండు వేర్వేరు లాక్​లను అమర్చాం. ఒకటి పెట్రోల్​ పెట్రోల్​కు, మరొకటి బ్యాటరీకి. వినియోగదారుడి అవసరం మేరకు వారు ఏదైనా ఉపయోగించుకోవచ్చు."

-పాండియ రుచిత్​ భవద్వేష్, విద్యార్థి

ఈ బైక్​ మోటర్​కు 4 బ్యాటరీలు అమర్చారు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంగా వెళ్లగల ఈ బైక్​ను ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.​ పెట్రోల్​, విద్యుత్​.. రెండింటికి వేర్వేరు యాక్సలేటర్లను ఏర్పాటు చేశారు.

పెట్రో భారాన్ని, ఎలక్ట్రిక్​ బైక్స్​లోని లోపాలను అధిగమించేందుకు రూపొందించిన ఈ హైబ్రిడ్​ బైక్​ వాహనదారులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: ప్రపంచంలోనే హైస్పీడ్​ రైలు- చైనా ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.