ETV Bharat / bharat

15 ఏళ్లుగా నిరుపేద రోగులకు సాయం.. కొవిడ్​లోనూ సహాయం.. ఎక్స్​రే, మందులు ఉచితంగా.. - 15 ఏళ్లుగా నిరుపేదలకు ఉచిత సహాయం చేస్తున్న వ్యక్తి

Gujarat Man Assists Destitute Patients : చిన్న దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి.. ఖాళీ సమయంలో పేదరోగులకు చేతనైన సహాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కొవిడ్ సమయంలోనూ ఎవరూ ముందుకు రాకపోయినా.. ధైర్యం చేసి రోగులకు మందులను అందించాడు. ఇలా 15 సంవత్సరాలుగా సహాయం చేస్తున్న గుజరాత్ చెందిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Gujarat Man Assists Destitute Patients
15 ఏళ్లుగా పేద రోగులకు ఉచిత సేవలందిస్తున్న వ్యక్తి
author img

By

Published : Jul 23, 2023, 8:15 PM IST

15 ఏళ్లుగా నిరుపేద రోగులకు సాయం

Gujarat Man Assists Destitute Patients : ప్రస్తుత రోజుల్లో సహాయం అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు చాలా మంది. ఆర్థికంగా కాకపోయినా.. మాట సాయం చేసేవారు కూడా ఎవరూ కనిపించడం లేదు. ఇంకా చదువుకోని అభాగ్యులు ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలకో.. ఆసుపత్రికో వెళ్తే పట్టించుకోనే నాధుడే ఉండడు. ఎవరి పనుల్లో వారే ఉంటారు.. అడిగినా కూడా సమాధానం చెప్పారు. కానీ, గుజరాత్​లోని సిటీ ఆసుపత్రిలో మాత్రం నేను ఉన్నానంటూ ముందుకు వస్తున్నాడు ఓ వ్యక్తి... ఆసుపత్రికి వచ్చిన వారికి తాను చేయదగిన సహయన్ని అందిస్తున్నాడు.

రాజ్​కోట్​కు చెందిన జితేంద్ర సింగ్... సిటీ ఆసుప్రతికి వైద్యం కోసం వచ్చే పేద రోగులకు సహాయన్ని అందిస్తున్నాడు. గత 15 సంవత్సరాల నుంచి ఇలానే సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న దుకాణం నడుపుతూ జీవనం సాగించే జితేంద్ర.. ఖాళీ సమయంలో తనకు చేతనైనంత సహాయం అందిస్తున్నాడు. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మార్గనిర్దేశాలు చేస్తూ సహాయం చేస్తున్నాడు...

నేను పేదరోగులకు సహాయం చేస్తాను. అది కూడా బంధువులు ఎవరూ లేని వారికి సాయం అందిస్తాను. ఇప్పటివరకు సుమారు 108 మంది రోగులకు వైద్య సదుపాయాలను పొందేలా సాయం చేశాను. వారికి ఎక్స్-రేలు తీయించటం, మందులు తెచ్చి ఇవ్వటం వంటివి చేశాను. ఇలా నేను చేయగలిగినది ఏమైనా సహాయం చేస్తాను.

-జితేంద్ర సింగ్

కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితిలోనూ.. అనేక మందికి సాయాన్ని అందించాడు జితేంద్ర. ఆ సమయంలో ఎవరూ ముందుకు రాకపోయినా.. ధైర్యం చేసి అనేక మంది రోగులకు మందులను అందిచాడు. అలానే వారికి కావలసిన వస్తువులు తెచ్చి ఇచ్చి వారికి అండగా నిలిచాడు.

గత 15 సంవత్సరాలుగా ప్రజలకు సహయన్ని అందిస్తున్నాను. కొవిడ్ వంటి సమయంలోనూ రోగులకు సాయం చేశాను. ఇదంతా భగవంతుని దయ.. ఎవరూ ఆసుపత్రికి రావల్సిన అవసరం రాకూడదనని దేవుని ప్రార్థిస్తున్నాను.

-జితేంద్ర సింగ్ అన్నారు.

15 సంవత్సరాల కితం జితేంద్ర సింగ్.. తన కొడుకుని ఆసుపత్రిలో చేర్పించటానికి వచ్చినప్పుడు ఎవరూ తనకు సహాయం చేయలేదు. ఆ సమయంలో తాను పడిన ఇబ్బందులు ఎవరూ పడకూడదని భావించి.. అప్పటి నుంచే ఇలా సాయం చేయటం ప్రారంభించానని తెలిపారు జితేంద్ర.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.