ETV Bharat / bharat

'మొబైల్ ఫోన్ల వల్లే అత్యాచార ఘటనలు' - గుజరాత్​ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Gujarat minister harsh sanghavi: మొబైల్ ఫోన్ల వల్లే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయని గుజరాత్​ హోంమంత్రి హర్ష్ సంఘవి వ్యాఖ్యానించారు. తెలిసిన వ్యక్తులైన పొరుగిళ్లల్లో ఉండేవారు, కుటుంబ సభ్యులు సైతం ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటం మరో ముఖ్య కారణంగా తెలిపారు.

gujarat-minister-harsh-sanghavi
మొబైల్ ఫోన్ల వల్లే అత్యాచార ఘటనలు: మంత్రి
author img

By

Published : Apr 2, 2022, 8:31 PM IST

Mobile phones reason for rapes: భారత్‌లో అత్యాచారాలకు మొబైల్‌ ఫోన్‌లే కారణమని గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి అన్నారు. మొబైల్‌ ఫోన్‌లోకి అశ్లీల వీడియోలు సులభంగా వచ్చేస్తున్నాయని.. ఇవి కొందరిలో దుర్బుద్ధిని రేపుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో అత్యాచారాలు భారీగా పెరిగిపోవడానికి ఇతర కారణాలను కూడా మంత్రి వివరించారు. తెలిసిన వ్యక్తులైన పొరుగిళ్లల్లో ఉండేవారు, కుటుంబ సభ్యులు సైతం ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటం మరో ముఖ్య కారణంగా తెలిపారు. ఈ తరహా ఘటనలో ముఖ్యంగా చిన్నపిల్లలపై జరుగుతున్నట్లు వెల్లడించారు.

భారతదేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి మొబైల్ ఫోన్లు, తెలిసిన వ్యక్తులే కారణమని, ఇటీవలి సర్వేలో ఇది వెల్లడైనట్లు హర్ష్ సంఘవి స్పష్టం చేశారు. 'అత్యాచారాలు సమాజానికి మాయని మచ్చగా నిలుస్తాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు శాంతి భద్రతలు సరిగా లేవని పోలీసులను నిందిస్తాం. కానీ ప్రతిసారి వారిని నిందించలేం. కుమార్తెపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే.. తప్పు పోలీసులది కాదు. ఇందుకు కారణం ఆ తండ్రి చేతిలోని సెల్‌ఫోన్‌' అని హోం మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కులం- మతం లేని సర్టిఫికెట్​ కోసం హైకోర్టుకు బ్రాహ్మణ యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.