ETV Bharat / bharat

Condom: కండోమ్‌ మరిచిపోయి అసహజ రీతిలో.. చివరకు? - కండోమ్​ తీసిన ప్రాణం

అసహజ రీతిలో కలయికలో పాల్గొన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కండోమ్​కు(Condom) బదులు జిగురు లాంటి పదార్థాన్ని(epoxy adhesive) వినియోగించడం వల్లే అతడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

condom man dies news
కండోమ్​ మర్చిపోయి అసహజ రీతిలో కలయిక
author img

By

Published : Aug 26, 2021, 10:08 AM IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కండోమ్‌కు(Condom) బదులు జిగురులాంటి పదార్థాన్ని వినియోగించి అసహజ రీతిలో కలయికలో పాల్గొని మృత్యువాతపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్‌ (25) అనే యువకుడు జూన్‌ 23న తన ఇంటి సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కొందరు గమనించారు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సల్మాన్ ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. అతడు అసహజ రీతిలో కలయికలో పాల్గొనడం వల్లే మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

అసలు ఏమైందంటే..?

సల్మాన్‌ జూన్‌ 22న తన ప్రేయసితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లాడు. వెంట కండోమ్‌ తీసుకెళ్లడం మర్చిపోయిన సల్మాన్‌ దానికి బదులు జిగురు లాంటి పదార్థం (epoxy adhesive)ను వినియోగించాడు. దాని ప్రభావం వల్ల అతడి మర్మాంగం సహా పలు అవయవాలు చెడిపోయి మృత్యువాతపడ్డాడు.

కండోమ్‌ను తీసుకెళ్లడం మర్చిపోవడం వల్ల గర్భం రాకుండా ఉండేందుకే వారు ఆ జిగురును వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్‌తోపాటు అతడి ప్రియురాలు కూడా మత్తు పదార్థాలకు బానిసగా(Drug addicts) మారినట్లు గుర్తించారు. సల్మాన్​ తాజా పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదని.. అది వచ్చాక ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని అహ్మదాబాద్‌ 7వ జోన్‌ డీసీపీ ప్రేమ్‌సుఖ్‌ తెలిపారు.

ఇదీ చూడండి: కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై గ్యాంగ్​ రేప్

ఇదీ చూడండి: మిత్రుడి ప్రాణాలు కాపాడబోయి.. మరో ముగ్గురు కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.