గుజరాత్ కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం రాపార్కు సమీపంలో ఉన్నట్లు గాంధీనగర్‌కు చెందిన భూకంప అధ్యయన సంస్థ(ఐఎస్ఆర్) వెల్లడించింది. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
బుధవారం సాయంత్రం 7.14 గంటలకు భూమిలో ప్రకంపనలు సంభవించాయని ఐఎస్ఆర్ అధికారి ఒకరు తెలిపారు. రాపార్కు 25కిలో మీటర్ల దూరంలో 6 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా.. దుదాయ్లోనూ 2.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవిచాయని చెప్పారు.
ఇదీ చూడండి: ఆ నది ఉగ్రరూపం- 50 ఏళ్లలో తొలిసారి ఇలా...
ఇదీ చూడండి: కేరళలో 22వేల కరోనా కేసులు- మిగతా రాష్ట్రాల్లో ఇలా..